USAID: యూఎస్‌ఏఐడీలో 83 శాతం కార్యక్రమాలకు ముగింపు..! 1 y ago
యూఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్టు అమెరికా మంత్రి మార్కో రూబియో తెలిపారు. విదేశాంగశాఖ కింద కేవలం కొన్ని కార్యక్రమాలకే ఆర్థిక సాయాన్ని అందిస్తామని అన్నారు.” 5200 కాంట్రాక్టులను రద్దు చేశాం. యూఎస్‌ఎయిడ్‌లోని 83 శాతం కార్యక్రమాలకు అధికారికంగా ముగింపు పలుకుతున్నాం. అమెరికాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. దీనిపై తీవ్రంగా శ్రమించిన ‘డోజ్’ సిబ్బందికి ధన్యవాదాలు” అని రుబియో ట్వీట్ చేశారు.